Anakapalli: అనకాపల్లిలో అభివృద్ధి పనుల పరిశీలనకు ఎమ్మెల్యే కొణతాల పర్యటన!

Anakapalli: అనకాపల్లి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించనున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పర్యటన వివరాలు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 2:21 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో అభివృద్ధి పనుల పరిశీలనకు ఎమ్మెల్యే కొణతాల పర్యటన!

Anakapalli: నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రేపు పర్యటించనున్నారు. ఉదయం 6.30 గంటలకు ఆర్‌వో కార్యాలయం నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది.

ముందుగా ఆర్‌వో కార్యాలయంలో సుమారు రూ.2 కోట్లతో చేపట్టిన గెస్ట్‌హౌస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించనున్నారు. అనంతరం మిర్యాల కాలనీ 4వ వీధిలో రూ.20 లక్షలతో చేపట్టిన రోడ్డు, కాలువ పనులను పరిశీలిస్తారు.

అన్నపూర్ణ బ్యాంక్ రోడ్డులో కాలువపై రూ.32 లక్షలతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను, అదే కాలువపై రూ.6.40 లక్షలతో చేపట్టిన ఐరన్ బ్రిడ్జి నిర్మాణ పనులను కొణతాల పరిశీలించనున్నారు.

అనంతరం ఏఎంసీ కాలనీలో రూ.6 లక్షలతో నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్, రూ.40 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం పనులను పరిశీలిస్తారు. వుడ్‌పేట చదువుల వారి వీధిలో రూ.10 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను, కాశీ విశ్వేశ్వర ఆలయం సమీపంలో రూ.10 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.

అలాగే రూ.20 లక్షలతో సర్వకాంబ పార్కును అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన పనులను పరిశీలిస్తారు. వేల్పుల వీధిలో రూ.20 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించిన అనంతరం మల్లవరపు వీధిలోని రహదారిని కూడా ఎమ్మెల్యే పరిశీలించనున్నారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పర్యటన కొనసాగనుంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI