Simhachalam: భైరవవాక క్లీన్ స్వీప్ లో పాల్గొన్న గంటా, నాగబాబు

Simhachalam: సింహాచలం భైరవవాక ఆలయ పరిసరాల్లో జరిగిన 'క్లీన్ స్వీప్' కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI
Published on: 23 May 2026 4:09 PM IST
Simhachalam
X

Simhachalam: భైరవవాక క్లీన్ స్వీప్ లో పాల్గొన్న గంటా, నాగబాబు

Simhachalam: సింహాచలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రజలను చైతన్యం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సింహాచలం సమీపంలోని భైరవవాక ఆలయ పరిసరాల్లో క్లీన్ స్వీప్ స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు తో కలిసి శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం ఎంత ప్రమాదకరమో పాఠశాల దశ నుంచే విద్యార్థులందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వెయిటేజీ మార్కులిస్తే మరింత చైతన్యం తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

క్లీన్ స్వీప్ ను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు భైరవవాక ఆలయ దర్శనానికి వస్తున్న నేపథ్యంలో వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముందని నాగబాబు పేర్కొన్నారు. అటవీ శాఖ నిబంధనల కారణంగా ఆలయ పరిసరాల్లో ఎలాంటి పనులు చేసే అవకాశం లేదని గంటా తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని నాగబాబు చెప్పారు.

ప్లాస్టిక్ సంచుల స్థానంలో గుడ్డ సంచులు వాడాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపుర్లతో ఆలయ పరిసరాల్లో ఉన్న చెత్తను గంటా, నాగబాబులు శుభ్రం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, పంచకర్ల సందీప్, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, శాఖారి శ్రీనివాస్, పంచదార్ల శ్రీనివాస్, చెట్టుపల్లి గోపీ, గాడు చిన్ని కుమారి లక్ష్మి, కసిరెడ్డి దామోదరరావు, కృష్ణయ్య, లొడగల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story