Gopalapatnam: గోపాలపట్నంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ ర్యాలీ!

Gopalapatnam: గోపాలపట్నం తాహా మసీదు ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ శాంతి ర్యాలీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు జెండా ఊపి ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 26 Aug 2026 12:39 PM IST
Gopalapatnam
X

Gopalapatnam: గోపాలపట్నంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ ర్యాలీ!

Gopalapatnam: పవిత్ర మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలపట్నం తాహా మసీదు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గణబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మసీదు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో స్వయంగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నడిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన 'మిలాద్-ఉన్-నబీ' సర్వమానవాళికి ఎంతో పవిత్రమైన రోజని కొనియాడారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ మిలాద్-ఉన్-నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ & ఇస్లామిక్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు ఎస్.కె. ఎమ్. సుభాని, తాజ్, కాసిం, అలీ తదితరులుగోపాలపట్నం తాహా మసీదు కమిటీ అధ్యక్షుడు నసీర్ ఖాన్, జిలాని, బొఖారి, ఖాదరి ఖలీల్ మరియు కమిటీ సభ్యులు

నందమూరి నగర్ మసీదు కమిటీ అధ్యక్షుడు ఎస్.కె. నాగూర్ మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, మత పెద్దలు, యువకులు పాల్గొని మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story