Visakhapatnam: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు ప్రారంభం

Visakhapatnam: విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ E-బస్సులను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు!

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 July 2026 5:31 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు ప్రారంభం

విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం విమానాశ్రయానికి ఈ-బస్సులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు గారు.

PM ఈ - బస్సులో ప్రయాణించిన మంత్రి మండిపల్లి,MLA పల్లా శ్రీనివాసరావు, RTC ED, RM అధికారులు.

రాష్ట్రానికి రానున్న 1050 ఈ బస్సులు- విశాఖకు 100 బస్సులు కేటాయింపు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్యావరణహిత, అత్యాధునిక ప్రజా రవాణా సేవలను అందించే దిశగా PM ఈ-బస్సులను రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖ స్టీల్ సిటీ డిపోలో ప్రారంభించారు. ప్రధానమంత్రి PM e-Bus Sewa Scheme ద్వారా రాష్ట్రానికి రానున్న 1,050 ఈ బస్సులలో విశాఖకు కేటాయించిన 100 ఈ-బస్సుల్లో 20 బస్సులను భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేకంగా నడపనున్నారు.

గాజువాక–ఎన్‌ఏడీ–ఆనందపురం, అలాగే గాజువాక–రైల్వే స్టేషన్–ఆర్టీసీ కాంప్లెక్స్–సిరిపురం మార్గాల్లో ఈ బస్సులు సేవలందించనున్నాయి. 12 మీటర్ల పొడవు, ఎయిర్ సస్పెన్షన్, ఆటోమేటిక్ డోర్లు, 35 సీట్ల సామర్థ్యం, దివ్యాంగుల కోసం వీల్‌చైర్ లిఫ్ట్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో రూపొందిన ఈ బస్సులు విశాఖ నగరం–భోగాపురం విమానాశ్రయం మధ్య వేగవంతమైన, సురక్షితమైన, కాలుష్యరహిత రవాణాను అందిస్తూ రాష్ట్రంలో గ్రీన్ మొబిలిటీకి మరో కీలక మైలురాయిగా నిలవనున్నాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story