Anakapalli: అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి!
Anakapalli: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాలమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Anakapalli: అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి!
Anakapalli: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న మంత్రికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ గొల్లబాబు, ఈఓ శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజల అనంతరం ఆలయ మండపంలో వేదపండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాలువాతో మంత్రిని సత్కరించి, శ్రీ నూకాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, నాయకులు, ఆలయ సిబ్బంది మంత్రిని కలుసుకున్నారు.




