Anakapalli: రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టివేత!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 6 Aug 2026 12:52 PM IST
Anakapalli
X

Anakapalli: రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టివేత!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని వలలోకి దించారు. మైన్స్ శాఖలో సర్వేయర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణ అంబేద్కర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల ప్రకారం, బాధితుడు సందిన సునీల్ వద్ద నుంచి తన పని చేసేందుకు మురళీకృష్ణ అంబేద్కర్ మొత్తం రూ.15 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఏసీబీ అధికారుల సూచనల మేరకు బాధితుడు రూ.5 లక్షలు అందజేస్తుండగా, ముందుగానే మాటు వేసిన అధికారులు సర్వేయర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story