Chodavaram: మెగా పేరెంట్స్ డే భోజనాల రచ్చ.. మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన!
Chodavaram: మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్పుపై ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్.
Chodavaram: మెగా పేరెంట్స్ డే భోజనాల రచ్చ.. మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు గునూరు వరలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంఎంతో ప్రతిష్టాత్మకంగా గొప్పలు చెప్పుకుంటూ నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి పిల్లల తల్లి, తండ్రి ఇద్దరు ధ్యాహా హాజరుకావాలని పిలుపుని ఇస్తున్నారని, దానికి సంబంధించి పప్పు ఆకు కూర, వెజిటబుల్ కర్రీ ఎగ్ కర్రీ మూడు రకాల కూరలతో భోజనాలు పెట్టాలని స్థానిక పాఠశాలల హెచ్ఎంలు మధ్యాహ్న భోజన కార్మికులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారు.
కానీ మూడు రకాల కూరలతో భోజనం పెట్టాలంటే దానికి సంబంధించి కూర ఖర్చు ఏంటి, ఎంత ఇస్తున్నారు అనేది ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. డిఈఓ ఆఫీస్ నుండి గాని, డైరెక్టర్ ఆఫీస్ నుండి గాని దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఒక పేరెంట్ కి ఎంత ఖర్చు కేటాయిస్తున్నారు అనేది చెప్పకుండా మూడు రకాల కూరలతో వంటలు చేయమని చెప్పి చెబుతూ కొన్ని స్కూల్స్లో వండకపోతే మానేయండి, పేరెంట్స్ తో వండించుకుంటాం అని బెదిరింపులకు దిగుతున్నారని ఆమె అన్నారు.
సరిపడా వర్కర్స్ లేరు, ఉన్న వర్కర్స్ నీ రాష్ట్ర ప్రభుత్వం జీవో పేరుతో తొలగించింది, వర్కర్స్ లేకపోవడం పిల్లల పేరెంట్స్ కి, పిల్లలకి వంట చేయమని చెప్పటం, పోయిన ఏడాది జూన్ లో మెగా పేరెంట్స్ డే నిర్వహించి అటహాసంగా భోజనాలు పెట్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజుకి ఆ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ రకరకాల కూరలతో భోజనాలు పెట్టమని చెప్పడం చాలా దుర్మార్గమని ఆమె అన్నారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మెనూ మార్పులు చేయాలని మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.




