Visakhapatnam: స్కూటీపై నుంచి పడిన బ్యాగ్ వాపస్: బాధితుల హర్షం!

Visakhapatnam: విశాఖలో పోగొట్టుకున్న ల్యాప్‌టాప్ బ్యాగ్, ఐఫోన్, నగదును గంటల వ్యవధిలో రికవరీ చేసిన మల్కాపురం పోలీసులు. బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

SHIVA, BHIMILI
Published on: 2 Sept 2026 7:10 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: స్కూటీపై నుంచి పడిన బ్యాగ్ వాపస్: బాధితుల హర్షం!

Visakhapatnam: నేటి శుభోదయ సెప్టెంబర్ : 01 విశాఖ నగరం, పెదగంట్యాడ, డెయిరీ కాలనీకి చెందిన ఎం న్ బి యూ శ్రీ వాణి, భర్త కే,వి ఎస్, ఆర్ మూర్తి, వయస్సు 49 సంవత్సరాలు, తన కుమార్తె ప్రత్యూషతో కలిసి స్కూటీపై వన్‌టౌన్ ప్రాంతం నుండి గాజువాక వైపు వస్తుండగా, గోస్తని గేట్ దాటిన అనంతరం స్కూటీ ముందు భాగంలో ఉంచిన ల్యాప్‌టాప్ బ్యాగ్ ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయింది.

ఆ సమయంలో వారి వెనుక నుండి వస్తున్న ఒక కారు ఆగి, రోడ్డుపై పడిపోయిన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన శ్రీ వాణి వెంటనే మల్కాపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందిన వెంటనే మల్కాపురం క్రైమ్ ఎస్‌ఐ శ్రీ జి. విజయ్ కుమార్ తక్షణమే స్పందించి, సిబ్బంది సహకారంతో చర్యలు చేపట్టి, పోగొట్టుకున్న ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను గుర్తించి రికవరీ చేశారు.ఆ బ్యాగ్‌లో ఉన్న లెనోవో ల్యాప్‌టాప్, ఐఫోన్, శామ్‌సంగ్ మొబైల్ ఫోన్, చెక్ బుక్స్, క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మరియు నగదు రూ.6,000/- తదితర వస్తువులను పూర్తిగా రికవరీ చేసి, బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు.

తాము పోగొట్టుకున్న విలువైన వస్తువులను పోలీసులు తక్షణమే స్పందించి, స్వల్ప సమయంలోనే రికవరీ చేసి తిరిగి అప్పగించినందుకు శ్రీ వాణి మరియు ఆమె కుమార్తె ప్రత్యూష మల్కాపురం పోలీసులకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story