Makavarapalem: మాకవరపాలెంలో రూ.85,200 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్!
Makavarapalem: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం తూటిపాల పరిధిలో 433.3 ఎకరాల్లో రూ.85,200 కోట్లతో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు జీవో విడుదల.
Makavarapalem: మాకవరపాలెంలో రూ.85,200 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్!
Makavarapalem: మాకవరపాలెం మండలంలోని తూటిపాల రెవెన్యూ పరిధిలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తూటిపాల రెవెన్యూలో అడిగర్లపాలెం, పాపయ్యపాలెంలో ల్యాండ్ బ్యాంకు కింద గుర్తించిన భూముల్లో 433.3 ఎకరాలను వెయ్యి మెగావాట్ల హైపర్స్కేల్/ కోలోకేషన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించింది.
రూ.85.200 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ నిర్మాణానికి అక్టోబరులో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్కి కేటాయించిన భూములను సరిహద్దులను నిర్ధారించడానికి రెవెన్యూ అధికారులు సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో గ్రామ సభ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.




