Madhurawada: మధురవాడలో రోడ్డు ప్రమాదం: బైక్ ఢీకొని మహిళ దుర్మరణం!
Madhurawada: మధురవాడ చంద్రంపాలెంలో సోమవారం రోడ్డు దాటుతున్న మహిళను అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Madhurawada: మధురవాడలో రోడ్డు ప్రమాదం: బైక్ ఢీకొని మహిళ దుర్మరణం!
మధురవాడ: మధురవాడ పరిధిలోని చంద్రంపాలెం HDFC బ్యాంక్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం... మధురవాడ సాయిప్రియ గార్డెన్స్ లోని మెట్రో హైట్స్ నివాసి జగ్గుపిల్లా పాపయ్యమ్మ(53) సోమవారం ఉదయం 09:15-09:30 గంటల సమయంలో చంద్రంపాలెం వద్ద సర్వీస్ రోడ్డు దాటుతుండగా.
వేగంగా నిర్లక్ష్యంగా వచ్చిన బైక్ (AP40CM2546)ఆమెను బలంగా ఢీకొట్టింది.తీవ్రంగా గాయపడిన ఆమెను వేదాంత ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం12:47 గంటలకు ఆమె మృతి చెందారు.మృతురాలి కుమారుడు జగ్గుపిల్లా నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




