Madhurawada: వినాయక చవితి మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి - సీఐ
Madhurawada: వినాయక చవితి మండపాలకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అనుమతి తీసుకోవాలని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ తెలిపారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Madhurawada: వినాయక చవితి మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి - సీఐ
మధురవాడ: వినాయక చవితి ఉత్సవ కమిటీలు భద్రతా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ గేదెల బాలకృష్ణ తెలిపారు. నగర సీపీ డాక్టర్ శంఖబ్రాత బాగ్చి ఆదేశాల మేరకు ఉత్సవాల్లో డీజేలు,అసాంఘిక నృత్యాలకు ఎట్టిపరిస్థితిలోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు.
మండపాల ఏర్పాటుకు www.ganeshutsav.net పోర్టల్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి.పోలీసుల పరిశీలన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎన్.ఓ.సిఆన్‌లైన్‌లోనే లభిస్తుంది.
మండపాలు, ఊరేగింపులు, నిమజ్జన సమయాల్లో డీజేలు పూర్తిగా నిషేధం.కేవలం సాధారణ మైకులు మాత్రమే వాడాలి.ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడాలని,మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.




