Madhurawada: చంద్రంపాలెం జెడ్పీ స్కూల్‌లో నారా లోకేష్ పర్యటన

Madhurawada: మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్. రూ.6.48 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభం.

JAI RAM, MADURAWADA
Published on: 22 Aug 2026 4:31 PM IST
Madhurawada
X

Madhurawada: చంద్రంపాలెం జెడ్పీ స్కూల్‌లో నారా లోకేష్ పర్యటన

మధురవాడ: చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు.

పాఠశాలలో సుమారు రూ.6.48 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ మంత్రి లోకేశ్ ప్రారంభించారు. స్కూల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్ బాల్, వాకింగ్ ట్రాక్ల ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో వాలీబాల్, బాస్కెట్ బాల్ ఆడి సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ నీలిమ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఐఏఎస్, అధికారులు, నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story