Vizag: మహానాడు వీక్షణ కార్యక్రమాలపై మంత్రి లోకేష్ జూమ్ రివ్యూ!
Vizag: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ 'మహానాడు' వీక్షణ కార్యక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ శనివారం క్లస్టర్ ఇంచార్జులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Vizag: మహానాడు వీక్షణ కార్యక్రమాలపై మంత్రి లోకేష్ జూమ్ రివ్యూ!
Vizag: మహానాడు వీక్షణ కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్, కో క్లస్టర్ ఇంచార్జులతో శనివారం ఆయన నిర్వహించిన జూమ్ కాల్ లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. భీమిలిలో 12 క్లస్టర్లు ఉండగా.. ప్రతి క్లస్టర్ లో నాయకులకు హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. వేదిక మ్యాపింగ్ చేసి.. ఇద్దరు సాంకేతిక నిపుణులను సిద్ధం చేయాలన్నారు.
మే 26 వ తేదీ సాయంత్రం 4 గంటలకు వీక్షణ కార్యక్రమాన్ని టెస్టింగ్ చేస్తారు. ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడు వీక్షణ కార్యక్రమ పరిశీలన బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. సీనియర్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సన్మానించాలని నిర్ణయించారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన టీడీపీ కుటుంబాలను ఈ సమావేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలన్నారు. ఎల్లో బ్రాండింగ్ జోన్ ఏర్పాటు చేసి, క్లస్టర్ స్థాయి సమావేశాలను నిర్వహించాల్సిందిగా చెప్పారు.




