Rolugunta: రోలుగుంటలో బీఎన్ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో కూటమి నేతల ఘర్షణ!

Rolugunta: అనకాపల్లి జిల్లా రోలుగుంటలో బీఎన్ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో టీడీపీ-జనసేన వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 6 Sept 2026 12:45 PM IST
Rolugunta
X

Rolugunta: రోలుగుంటలో బీఎన్ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో కూటమి నేతల ఘర్షణ!

Rolugunta: రోలుగుంట బి.ఎన్. రోడ్డు పనుల ప్రారంభం సందర్భంగా కూటమి నాయకుల మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

​జనసేన ఇన్‌ఛార్జ్ PVSN రాజా రోడ్డు పనులను పర్యవేక్షించేందుకు రావడంతో, టిడిపి నేతలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు.

ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ​అనంతరం ఎమ్మెల్యే రాజా మరియు జనసేన ఇన్‌ఛార్జ్ వేర్వేరుగా రోడ్డు పనులను ప్రారంభించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story