Anakapalli: అనకాపల్లి జనసేన కార్యాలయంలో వినతుల స్వీకరణ!

Anakapalli: జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల వినతుల స్వీకరణ. ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్న ప్రజలు మరియు కార్యకర్తలు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Updated on: 30 Aug 2026 1:06 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి జనసేన కార్యాలయంలో వినతుల స్వీకరణ!

Anakapalli: అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కూటమి పార్టీ కార్యకర్తలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను రామ్కి దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఆయన, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ప్రజలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లి, అతి త్వరలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భీమరశెట్టి రామ్కి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story