Anakapalle: జనసేనలో కీలక పదవుల భర్తీ.. 25 పార్లమెంట్ స్థానాలకు పర్యవేక్షకులు!

Anakapalle: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 24 Jun 2026 10:28 AM IST
Anakapalle
X

Anakapalle: జనసేనలో కీలక పదవుల భర్తీ.. 25 పార్లమెంట్ స్థానాలకు పర్యవేక్షకులు!

Anakapalle: అనకాపల్లి, జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయ సెక్రటరీ కమిటీ పర్యవేక్షకులను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమాల నేపథ్యంలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించేందుకు ఈ కమిటీలు కృషి చేయనున్నాయి. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం, నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు సమాచారం.

ఈ క్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ సెక్రటరీ కమిటీ పర్యవేక్షకుడిగా నియమితులయ్యారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలను పార్టీ అధిష్టానానికి అందించనున్నారు.

అలాగే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నారు. ఈ బాధ్యతలను అప్పగిస్తూ పార్టీ నాయకత్వం కొణతాల రామకృష్ణపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్లు జనసేన వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నియామకంతో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని జనసేన నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story