Pendurthi: సుజాతనగర్‌లో గణపతి పూజల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు!
Pendurthi: జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్‌లో వినాయక మండపాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దర్శించుకుని పూజలు చేశారు.
Pendurthi: సుజాతనగర్‌లో గణపతి పూజల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు!
పెందుర్తి: ఈ రోజు 14.09.2026 తేదీ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 97 వ వార్డు సుజాతనగర్ కిషోర్ లేఅవుట్ శ్రీ లక్ష్మీ కాలనీ కమ్యూనిటీ హాల్ లో ప్రతిష్టించిన గణపతి మండపాన్ని సోమవారం జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు దర్శించుకున్నారు.
నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆ మండపాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రత్యేక పూజలు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పాడిపంటలు ఉపాధి అవకాశాలు మెరుగు పడాలని గణపతిని ప్రార్థించారు. మండపానికి వచ్చిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం కనకారావు గారు, రాజా సుధాకర్ గారు,వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ గారు, కాలనీ అసోసియేషన్ పెద్దలు రామకృష్ణ గారు, సతీష్ గారు, తాతారావు గారు,సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ నీటిపల్లి మహేష్ గారు,పెందుర్తి ఏఎంసి డైరెక్టర్ లక్కీ గోవింద్ గారు, సీనియర్ నాయకులు జగన్మోహన్ పాత్రుడు గారు, కరణం కుమారస్వామి గారు,రాపర్తి కిషోర్ గారు, కోన మోహన్ కుమార్ నాయుడు గారు తదితర పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు కాలనీ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




