Anakapalle: ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం భీమరశెట్టి రామ్కి!

Anakapalle: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి వినతిపత్రాలను నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి స్వీకరించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 5 Aug 2026 10:12 AM IST
Anakapalle
X

Anakapalle: ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం భీమరశెట్టి రామ్కి!

Anakapalle: అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక నియోజకవర్గ ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి వివిధ ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను జనసేన నాయకులు స్వీకరించారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కి ప్రజలు, కార్యకర్తలు తెలిపిన సమస్యలను ఓపికగా విని వాటిపై సానుకూలంగా స్పందించారు.

అందిన ప్రతి వినతిని మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story