Paderu: పిజిఆర్‌ఎస్‌ అర్జీదారులకు ఉచిత భోజనం: జాయింట్ కలెక్టర్ శ్రీపూజ

Paderu: పాడేరులో ప్రతి శుక్రవారం పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారుల సౌకర్యార్థం ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ తెలిపారు.

SAI, PADERU
Published on: 11 Sept 2026 4:14 PM IST
Paderu
X

Paderu: పిజిఆర్‌ఎస్‌ అర్జీదారులకు ఉచిత భోజనం: జాయింట్ కలెక్టర్ శ్రీపూజ

పాడేరు: జిల్లా కేంద్రానికి సూదుర ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారులకు కనీస సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్‌) కు హాజరయ్యే అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమాని శ్రీపూజ తెలిపారు.

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ), పాడేరు, అన్న క్యాంటీన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు .

శుక్రవారం పాడేరులో నిర్వహించిన పిజిఆర్‌ఎస్‌ కార్యక్రమానికి హాజరైన అర్జీదారులకు ఐటీడీఏ పరిపాలనా విభాగం సిబ్బంది ఉచిత భోజనాన్ని పంపిణీ చేస్తారన్నారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మారుమూల, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో దూరం ప్రయాణించి జిల్లా కేంద్రానికి వస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం, వారిని గౌరవంగా చూసుకోవడం జిల్లా యంత్రాంగం బాధ్యతగా భావిస్తుందని పేర్కొన్నారు.

పిజిఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారుల సౌకర్యార్థం ప్రతి శుక్రవారం ఈ ఉచిత భోజన సదుపాయాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు .

పిజిఆర్‌ఎస్‌కు హాజరయ్యే అర్జీదారులందరూ ఈ ఉచిత భోజన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్న క్యాంటీన్ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU