Kanchili: బోన్ మ్యారో వ్యాధిగ్రస్తుడికి ఇప్పిలి కృష్ణారావు ఆర్థిక సాయం

Kanchili: కంచిలి మండలం బూరాగానికి చెందిన బోన్ మ్యారో బాధితుడికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేసిన జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు.

G.RAMBABU, SOMPET
Published on: 18 Aug 2026 2:22 PM IST
Kanchili
X

Kanchili: బోన్ మ్యారో వ్యాధిగ్రస్తుడికి ఇప్పిలి కృష్ణారావు ఆర్థిక సాయం

Kanchili: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని కంచిలి జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు అన్నారు. కంచిలి మండలం బూరాగం గ్రామానికి చెందిన దూపాన మాధవరావు గత కొంతకాలంగా బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఇప్పిలి కృష్ణారావు మానవతా దృక్పథంతో స్పందించారు.

మంగళవారం మాధవరావు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పిలి కృష్ణారావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న కుటుంబానికి చేయూతనివ్వడం, బాధలో ఉన్న మనిషికి భరోసా కల్పించడమే నిజమైన ప్రజాసేవ అని అన్నారు. "ప్రజల కోసం ప్రజల మధ్య ప్రజల కష్టాల్లో అండగా" నిలవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇప్పిలి కృష్ణారావుకం మాధవరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story