Anakapalle: తుమ్మపాలలో అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం మెగా వైద్య శిబిరం!

Anakapalle: తుమ్మపాలలో ఆర్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం. ఉచిత మెగా వైద్య శిబిరం, అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహణ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 13 Aug 2026 3:52 PM IST
Anakapalle
X

Anakapalle: తుమ్మపాలలో అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం మెగా వైద్య శిబిరం!

Anakapalle: తుమ్మపాల గ్రామంలో ఆర్కా ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అవయవదానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన తుమ్మపాల గ్రామానికి చెందిన స్వర్గీయ శ్రీ మల్ల యోగి నాగేశ్వరావు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో ఉచిత కంటి, దంత పరీక్షలతో పాటు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేపట్టి, అవసరమైన వారికి పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అవయవదానం ప్రాముఖ్యత, అవయవదానం ద్వారా మరొకరి జీవితానికి ఎలా వెలుగునివ్వవచ్చనే అంశాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ అధికారి శ్రీమతి సుభాషిణి హాజరయ్యారు. ఆర్కా అనకాపల్లి సభ్యులు ఆడారి సునీల్, కాండ్రెగుల చిరంజీవి, పెంటకోట అశోక్, కె.ఎం. నాయుడు, ఆర్కా కో-ఆర్డినేటర్ జగదీష్, కొణతాల అరుణ, ఆడారి ఉమా, ఇందూ, కాండ్రెగుల వంశీతో పాటు గవరపేట వీధి యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడంతో పాటు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, అవయవదానంపై అపోహలను వీడి అవగాహన పెంచుకోవాలని సూచించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story