Chintoor: చింతూరులో కుండపోత వర్షం: ఉగ్రరూపం దాల్చిన శబరి నది

Chintoor: చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షాలకు శబరి నది, సోకిలేరు వాగు పొంగిపొర్లుతున్నాయి. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 27 అడుగులకు చేరుకుంది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 12 Sept 2026 7:48 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో కుండపోత వర్షం: ఉగ్రరూపం దాల్చిన శబరి నది

చింతూరు: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గత రెండు రోజుల నుండి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో శబరి నదిలో నీరు భారీగా చేరి ఉదృతంగా ప్రవహిస్తుంది. శబరి నదికి అనుసంధానమైన సోకిలేరు, కుయుగురు చంద్రవంక వాగులు పొంగి పొర్లుతున్నాయి.

చూటూరు - ముకునూరు గ్రామాల మధ్య గల సోకిలేరు వాగు పరవళ్ళు తొక్కుతూ రహదారి పైకి ఎక్కి ప్రవహిస్తుంది. వరద మరింత ఉధృతి పెరిగితే చింతూరు నుండి విఆర్ పురం మండలాలకు రాకపోకలు స్తంభించనున్నాయి.

ప్రస్తుతం జలమయం అయిన రహదారి పైనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు.శబరి ఉదృతి పెరుగుతుండడంతో శబరి నీటిమట్టం చింతూరు వద్ద 27 అడుగులకు చేరుకొని ప్రవహిస్తుంది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR