Visakhapatnam: ఆనందపురం హరే కృష్ణ వైకుంఠంలో వైభవంగా నందోత్సవం, వ్యాసపూజ

Visakhapatnam: విశాఖ జిల్లా ఆనందపురం హరే కృష్ణ వైకుంఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, నందోత్సవం మరియు వ్యాసపూజ ఘనంగా నిర్వహించారు.

SHIVA, BHIMILI
Published on: 5 Sept 2026 4:13 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఆనందపురం హరే కృష్ణ వైకుంఠంలో వైభవంగా నందోత్సవం, వ్యాసపూజ

Visakhapatnam: ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమికి వేలాదిగా భక్తులు పాలుగుని భగవంతుని దర్శించు కొని తీర్ధ ప్రసాదం లు స్వీకరించి భగవంతుని అనుగ్రహం పొందినారు. హరే కృష్ణ వైకుంఠం వారి ఆధ్వర్యములో, 4, 5 సెప్టెంబర్ 2026 శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు హరే కృష్ణ వైకుంఠం లో నిర్వహించడం జరిగింది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి లో చివరి రోజు వ్యాసపూజ (గురు పూజ ) మరియు నందోత్సవం. ఈ రోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి మరుసతి రోజు నందోత్సవం ( నందమహరాజు కు పుత్రుడు జన్మిచాడని బృందావన వాసులు నిర్వహించబడిన పండుగ ) మరియు వ్యాస పూజ ( గురు పూజ ) హరే కృష్ణ మూవ్మెంట్ వ్యస్థాపక గురువు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాదులు గారి పుట్టిన రోజు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి పక్క రోజు శ్రీ నంద మహా రాజు తనకు కుమారుడు జన్మిచారు అని ప్రజలందరితో కలసి ఉత్సవమును నిర్వహించడం . దీనిని నందోత్సవం గా శ్రీ కృష్ణ జన్మాష్టమి మరుసతి రోజు హరే కృష్ణ మూవ్మెంట్ వారు ఈ రోజు జరుపబడినదిఈ సంప్రదాయం ను ఈ రోజు హరే కృష్ణ మూవ్మెంట్ లో నిర్వహించడం జరిగింది .

హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపక గురువు గారు శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారి 130 వ ఆవిర్భావ దినోత్సవం (పుట్టిన రోజును) ఈ రోజు వారి విగ్రహానికి అభిషేఖం సప్తనదుల నుంచి ( గంగ , యమునా, గోదావరి, సరస్వతి , నర్మదా, సింధు, కావేరి) సేకరించిన జలాలతో , పళ్ళ రసాలు, పంచామృతం ,పంచగవ్యాలతో మరియు వివిధ పుష్పములతో వేదం మంత్రముల, సంకీర్తనలతో అంగ రంగ వైభవముగా మహా అభిషేకము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారి జీవిత విశేషాలను డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు భక్తులకు వివరించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story