Visakhapatnam: విశాఖలో అటకెక్కిన 'ఆపరేషన్ లంగ్స్ 3.0'!

Visakhapatnam: విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్ సెల్లార్లలో వాణిజ్య కార్యకలాపాలు. నేతల ఒత్తిళ్లతో అటకెక్కిన జీవీఎంసీ 'ఆపరేషన్ లంగ్స్ 3.0' డ్రైవ్.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 7 Sept 2026 1:28 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో అటకెక్కిన 'ఆపరేషన్ లంగ్స్ 3.0'!

Visakhapatnam: అక్కయ్యపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో టీ దుకాణం, దస్తావేజుల కార్యాలయ ఇతర దుకాణాలు ఏర్పాటు చేశారు. జీవీఎంసీకి ఫిర్యాదులు వెళ్లగా మూడుసార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి వదిలేశారు. అపార్ట్మెంట్వాసులు రోడ్లపైనే కార్లను పార్కింగ్ చేయాల్సి వస్తోంది.

కోర్టు తీర్పిచ్చినా ఈస్ట్పయింట్ కాలనీలో గతేడాది ఓఅపార్ట్మెంట్ సిక్స్త్ ఫ్లోర్లో అనధికార నిర్మాణాలను కూల్చేందుకు జీవీఎంసీ నోటీసు జారీ చేయగా, సదరు యజమాని కోర్టును ఆశ్రయించారు. పార్కింగ్కు కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సెల్లార్లలో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది.

అలా అటకెక్కించారు కోర్టు ఆదేశాల మేరకు సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహించే వారిని తొలగించేందుకు జీవీఎంసీ కమిషనర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 'ఆపరేషన్ లంగ్స్ 3.0' ప్రారంభించారు. జోన్ల వారీగా సర్వే చేసి 90 అపార్ట్మెంట్లకు నోటీసులు జారీ చేశారు. తర్వాత ప్రత్యేక బృందాలను నియమించి కొన్నిచోట్ల తొలగింపు చర్యలు ఆరంభించారు. స్థానిక మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లతో సెల్లార్లపై చేపట్టిన ఆపరేషన్ లంగ్స్ 3.0 మొదట్ల అటకెక్కింది.

అంతా ఇష్టారాజ్యమే నగరంలో నిబధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వ్యాపారాలు కొనసాగిస్తున్న అపార్టుమెంట్లు వందల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గదులు నిర్మించి అద్దెకిస్తున్నారు. కొన్నింటిలో మందుల దుకాణాలు, క్లినిక్లు, కోచింగ్ సెంటర్లు, వసతి గృహాల క్యాంటీన్లు, బార్లు, మొబైల్ సర్వీసులు తదితర వ్యాపారాలు సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల స్టీల్ద్ ఏరియాను వాణిజ్య సముదాయాలుగా మార్చి ఫైనాన్స్ సంస్థలకు, జనరల్ స్టోర్స్క అద్దెకిస్తున్నారు. గాజువాక, పెందుర్తి, మధురవాడ పరిధిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.

'అంతా మేం చూసుకుంటాం..'

మీ వ్యాపారాలు సెల్లార్లలో నిర్వహించుకోండి. ప్రతి నెలా మాకు ఎంతో కొంత ఇవ్వండి' ఇదీ స్థానిక రాజకీయ నాయకుల ధోరణి. 'ఆపరేషన్ లంగ్స్ 3.0'లో భాగంగా సెల్లార్లలో వ్యాపార సముదాయాలు తొలగించకుండా అదికారులపై పలు రూపాల్లో ఒత్తిడి తెస్తున్నారు. మరో వైపు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జీవీఎంసీ అధికారులు, అపార్టుమెంట్ల యజమానులు కుమ్మక్కయ్యారు. ఫలితంగా రద్దీ ప్రాంతాల్లోని సెల్లార్లలోనూ వ్యాపారాలు సాగిపోతున్నాయి.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story