Visakhapatnam: విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయం!

Visakhapatnam: విశాఖ అభివృద్ధి, జీవీఎంసీ విస్తరణ, ప్రత్యక్ష మేయర్ ఎన్నికలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక దిశానిర్దేశం చేశారు.

SHIVA, BHIMILI
Published on: 25 Aug 2026 1:55 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయం!

Visakhapatnam: విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ సిటీ గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా విజన్ ఉన్న అగ్రనేత, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సమగ్ర ప్రణాళికను వెల్లడించారు.నగర భవిష్యత్తుపై సుదీర్ఘ విజన్‌తో వ్యవహరించే ఆయన,ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవీఎంసీ సరిహద్దుల విస్తరణ,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై అత్యంత కీలకమైన మార్గదర్శనం చేశారు.​జీవీఎంసీ పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రస్తుతం ఉన్న 98వార్డులను 120కి పెంచేందుకు చొరవ తీసుకున్న గంటా, అందుకోసం క్షేత్రస్థాయి పరిశీలనను శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు.ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గానికి చెందిన ఆనందపురం(26 పంచాయతీలు), పద్మనాభం (22),

భీమిలి రూరల్ (16) పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి(15) మండలానికి చెందిన మొత్తం79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావడానికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా స్థానిక నాయకులు,ప్రజల ఆమోదంతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న ఆయన,గ్రామసభల తీర్మానాలను ప్రభుత్వానికి పంపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.​గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల గంటా శ్రీనివాసరావుకున్న ప్రత్యేక శ్రద్ధతో విలీన గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పనులు నష్టపోకుండా ప్రత్యేక నిధులు,పన్నుల మినహాయింపు కల్పించేందుకు ప్రతిపాదించారు.ఏడాది క్రితమే పురపాలక శాఖ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు లేఖలు అందజేసి ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ ఆమోదం సాధించడంలో గంటా చొరవ కీలక పాత్ర పోషించింది.

​రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవికి ప్రత్యక్ష (డైరెక్ట్) ఎన్నికలు రానున్నాయనే ఆశాభావం వ్యక్తం చేస్తూ దీనిద్వారా విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే బలమైన నాయకత్వం లభిస్తుందన్నారు. రేపటి మేయర్ బరిలో గంటా రవితేజ ఉంటారా అని విలేకరులు ప్రశ్నించగా.. "ఏం... నేను పోటీ చేయకూడదా?" అంటూ తనదైన సమయస్ఫూర్తితో స్పందించారు.నగర భవిష్యత్తు అవసరాలను ముందే ఊహిస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలను జీవీఎంసీలో కలిపే ప్రతిపాదనపై నెల్లిమర్ల ఎమ్మెల్యేతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story