Anakapalli: చోడవరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భారీ బైక్ ర్యాలీ!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల అరాచక పాలనపై వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 12 Jun 2026 2:36 PM IST
Anakapalli
X

Anakapalli: చోడవరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భారీ బైక్ ర్యాలీ!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రశ్నిస్తూ సుమారు 1000 బైకులతో చోడవరం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయం నుండి నరసయ్యపేట గ్రామ పరిధిలోని వైయస్సార్ విగ్రహం వరకు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని అరాచక పాలనతో పరిపాలించాలని ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు ప్రజలను మాత్రం ముగ్గురు నలుగురు చొప్పున పిల్లల కనమని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎదవ చేశారు. మూడో పిల్లని కంటే 30,000 నాలుగో పిల్లని కంటే 40 వేలు అంటూ కామెడీ పథకాలు ఆపాలని ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఇచ్చే 30 వేల తో పిల్లలను కంటే హాస్పిటల్లో డెలివరీకి 50 వేలు పైన అవుతుందని అలాంటిది ఇలాంటి హాస్యాస్పద పిలుపునివ్వడం చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.

రాష్ట్రంలో ఒక మేకప్ మంత్రి ఉన్నారు, ఆవిడకు ఎండ తగిలితే మేకప్ ఊడిపోతుందని తెగ భయపడిపోతుంది అలాంటి మేకప్ మంత్రి, గతంలో ఉద్యోగాల కోసం తాము ఎదురుచూసేవాళ్లమని, ఇప్పుడు ఉద్యోగాలే మనకోసం ఎదురుచూస్తున్నాయని ఆమె మాట్లాడటం చూస్తే విడ్డురంగా ఉంటుంది. నేను వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారును వాడుకుంటూ నాపైనే మాట్లాడుతున్నారు అని ఎద్దవా చేశారు. ​నాకు పదవి ఉన్నా లేకపోయినా, గన్‌మెన్లు ఉన్నా లేకపోయినా కంటికి రెప్పలా కాపాడుకునే వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రూల్స్ పెడతారు కానీ పాటించమని అలవాటు లేదని కావాలంటే ముందు తన కొడుకు లోకేష్ తో ఇద్దరు గాని ముగ్గురు గాని పిల్లలను కనమని అప్పుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తే అర్థవంతంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. మీ ఇంట్లో మాత్రం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇద్దరు ముగ్గురు పిల్లలు కనలేరా? ప్రజలు మాత్రం ముగ్గురు నలుగురు పిల్లలని కని అప్పుల పాలు అవ్వాలా అని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా 100% నెరవేర్చరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండేళ్లు గడుస్తున్న ఒక్క కొత్త పింఛన్ అయినా సరే మంజూరు చేశారా. డీఎస్సీలో అవకతవకలతో రాష్ట్రంలో నిరుద్యోగులు జీవితాలతో ఆట్లాడుకున్నారని విమర్శించారు.

ఏదేమైనా రాబోయేది తమ ప్రభుత్వం మేనని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మేము ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి ఇంత మంది రావడమే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుందని తెలిపారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీని మూతపడేటట్టు చేసి రైతులను అన్యాయం చేసిన ఈ కోటమ ప్రభుత్వం త్వరలోనే ఇంటికి వెళ్ళిపోతుందని.

షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఉన్న బకాయిలను వెంటనే చెల్లించకపోతే వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెరుకు రైతులను ఆదుకోవాలని చోడవరం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే షుగర్ ఫ్యాక్టరీ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story