Chidikada: ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజున మొక్కల పంపిణీ, దేశభక్తి పోటీలు!

Chidikada: చీడికాడ మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం, 1,600 మందికి అన్నదానం, మొక్కల పంపిణీ నిర్వహించారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 2 Sept 2026 9:31 PM IST
Chidikada
X

Chidikada: ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజున మొక్కల పంపిణీ, దేశభక్తి పోటీలు!

చీడికాడ: ఈరోజు మాడుగుల నియోజక వర్గం చీడికాడ మండల పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి..ముందుగా చెట్టుపల్లి గ్రామం లో జరిగిన రక్తదాన శిబిరం లో యువకులు స్వచంధంగా పాల్గొని 35 యూనిట్ల బ్లడ్ డొనేట్ చేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఆచార్య నన్నయ్య యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ముర్రు ముత్యాలు నాయుడు విచ్చేసి యువకులకు సర్టిఫికెట్స్ ఇవ్వటం జరిగింది.

అనంతరం తునివలస గ్రామం లో సుమారు 1600 మందికి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం తునివలస గ్రామ నాయకుల సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది..అలాగే మండలం లో ప్రతి గ్రామం లో మొక్కలు పంపిణీ దేశభక్తి గేయాల పాటల పోటీలు వివిధ సహాయ కార్యక్రమాలు చెయ్యటం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన యువజన విభాగ కార్యక్రమం మండల జనసైనికులు అందరూ వీక్షించేలా LED స్క్రీన్ సోమునాయుడు గారి ఆర్ధిక సహాయంతో ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు జి వి మూర్తి మండల నాయకులు కృష్ణ ,సంతోష్ ,సూరిబాబు ,కిరణ్ ,రాము ,కొండల రావు ,శేఖర్, గణేష్ ,ప్రసాద్ ,అప్పారావు ,రామారావు ,అప్పలనాయుడు, శివ ,కృష్ణ మూర్తి తో పాటు గ్రామ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నార.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story