Bakkannapalem: విశాఖపట్నం బక్కన్నపాలెంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి సంబరాలు
Bakkannapalem: విశాఖపట్నం మధురవాడ పరిధిలోని బక్కన్నపాలెంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Bakkannapalem: విశాఖపట్నం బక్కన్నపాలెంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి సంబరాలు
Visakhapatnam: విశాఖపట్నం మధురవాడ జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోని బక్కన్నపాలెంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగాయి.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కృష్ణాష్టమి విశిష్టతను మరియు శ్రీకృష్ణుని తత్వాన్ని వివరించారు.
భగవదవతారం: విశ్వవ్యాపి అయిన దేవుని అంశతో శ్రీకృష్ణుడు ఈ భూమిపై శరీరాన్ని ధరించి అవతరించాడు. ఆయనే సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణుడు.
భగవద్గీత సందేశం: శ్రీకృష్ణుడు జన్మించిన 90 సంవత్సరాల తరువాత భగవద్గీతను బోధించాడు. గీతాబోధ తరువాతనే కృష్ణుడు సామాన్య మానవుడు కాడని, ఆయన జన్మ జ్ఞానంతో కూడుకున్నదని జ్ఞానులు గ్రహించగలిగారు.
కృష్ణాష్టమి నేపథ్యం: ద్వాపర యుగం నుండి శ్రావణ మాస బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఒక పెద్ద పండుగగా జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది.
జ్ఞానానికి కేంద్రం: శ్రీకృష్ణుడు అజ్ఞానానికి, జ్ఞానానికి సంధి వంటివాడు. అజ్ఞానం నుండి జ్ఞానానికి, అలాగే జ్ఞానం నుండి అజ్ఞానానికి చేరుకోవడానికి ఆయన కేంద్ర బిందువు. అందుకే ఆయన అష్టమి తిథినే ఎంచుకుని జన్మించాడు.
ధర్మ ప్రబోధం: మనకోసం మానవాకారాన్ని ధరించి, భగవద్గీత రూపంలో ధర్మాలను ప్రబోధించాడు. మారుతున్న కాలంలో ఎన్నో ధర్మాలు కనుమరుగైనప్పటికీ, జ్ఞానానికి విలువనిచ్చే భగవద్గీత మాటలు ఎన్నటికీ కనుమరుగు కావు. అంత గొప్ప దేవుడు మానవాకారంలో వచ్చిన ఈ సమయం ఎంతో పవిత్రమైనది, గొప్పది.
శ్రీకృష్ణుని జన్మదిన ప్రత్యేకత ప్రతి ఒక్కరికీ తెలియాలనే ఉద్దేశంతో, శ్రీ శ్రీ శ్రీ ప్రబోధానంద స్వామి దివ్య ఆశీస్సులతో ఈ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, ఆయన దివ్యానుగ్రహాన్ని పొంది కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు పోతిన మూర్తి బాబు,
విశాఖపట్నం కమిటీ సభ్యులు: శ్రీనివాస్, కామేశ్వరరావు, పుష్కరరావు,అప్పారావు, మోహన్ రావు, రమేష్, రామకృష్ణ ,విజయ,అరుణ్, మోహన్ వేపగుంట, భాస్కరరావు, శ్రీనివాస్ రావు, త్యాగరాజు, ముకుంద్, సత్యవతి మీనాక్షి పద్మ, శైలజ తదితరులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.




