Vizag: ఏపీ ఐటీ రంగంలో కీలక మైలురాయి.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్!
Vizag: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.
Vizag: ఏపీ ఐటీ రంగంలో కీలక మైలురాయి.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్!
Vizag: గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి ,భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు మరియు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు పలువురు బిజెపి ముఖ్య నేతలు పాల్గొన్నారు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు,బిజెపి సీనియర్ నాయకులు శ్రీ వెంగమాంబ శ్రీనివాస్ గారు మరియు ఇతర రాష్ట్ర, జిల్లా పదాధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలికారు.
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుండటం రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ రంగం మరింత విస్తరించడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.




