Anakapalli: అనకాపల్లిలో వైభవంగా శ్రీ మరిడి మాంబ అమ్మవారి ఘటాల ఊరేగింపు

Anakapalli: అనకాపల్లి కోట్ని వీధి మరిడి మాంబ అమ్మవారి పండగలో భాగంగా ఘటాల ఊరేగింపు. ప్రారంభించిన జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 24 Aug 2026 7:32 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో వైభవంగా శ్రీ మరిడి మాంబ అమ్మవారి ఘటాల ఊరేగింపు

Anakapalli: అనకాపల్లి పట్టణంలోని చారిత్రక కోట్ని వీధిలో కొలువైన శ్రీశ్రీశ్రీ మరిడి మాంబ అమ్మవారి పండగ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఘటాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి ఘటాల ఊరేగింపును ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లోని పలు వీధుల్లో ఘటాల ఊరేగింపు కొనసాగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుర్రాల శ్రీనివాస్ (వాసు), 84వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ తలారి లక్ష్మీప్రసాద్, కోట్ని రామకృష్ణ, ధర్మకర్తలు ఇల్లపు పరమేశ్వరరావు, కోట్ని సాయికుమార్, చెట్టుపల్లి సత్యనారాయణ కుమార్, వడ్డాది వంశీ, ఇందుగబిల్లి కవితారాణి, కోట్ని అయ్యన్నదొర, కోట్ని రాంబాబు, కోట్ని కొండలరావు, సన్యాసినాయుడు, కోట్ని సూరిబాబు, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు.

అలాగే కోట్ని వీధి పంచాయతీ పెద్దలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story