Visakhapatnam: బెస్ట్ ఎలక్షనీరింగ్ మేనేజ్మెంటే నా సక్సెస్ ఫార్ములా గంటా

Visakhapatnam: విజయానికి అభివృద్ధి ఒక్కటే సరిపోదు, ఎలక్షనీరింగ్ మేనేజ్మెంట్ చాలా అవసరమని మంగళగిరి టీడీపీ వర్క్‌షాప్‌లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 8 Sept 2026 11:48 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: బెస్ట్ ఎలక్షనీరింగ్ మేనేజ్మెంటే నా సక్సెస్ ఫార్ములా గంటా

Visakhapatnam: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన నాయకత్వ శిక్షణ వర్క్ షాపులో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ఒక్కటే గెలిపిస్తుందనుకుంటే 1999- 2004 అత్యుత్తమ స్థాయి అభివృద్ధిని అందించి హైటెక్ సిటి కట్టిన స్థానంతో పాటు ఓడిపోయామని.. అలాగే 2014-19లో మంచి అభివృద్ధి చేసి మళ్లీ ఓటమి పాలయ్యామని గుర్తు చేశారు.

డబ్బు ప్రభావం ఉంటుందనుకుంటే తమిళనాడులో మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే విజయ్ చేసిన ఖర్చు చాలా తక్కువన్నారు. నిరంతరాయంగా గెలవడానికి ఫార్ములా ఉందా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనను అడిగారని చెబుతూ ఎలక్షనీరింగ్ చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాలు మారి గెలుస్తుంటావ్ అని తన గురించి చెబుతుంటారని..

కానీ నియోజకవర్గం మారిన చాలామంది ఓడిపోయిన సంగతి ప్రస్తావించారు. గతంలో గెలిచిన భీమిలిలో 2024లో పోటీ చేసి రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మెజారిటీ తెచ్చుకున్నానని తెలిపారు. ఇగో లేకుండా.. సమస్య వస్తే కార్యకర్తలకు అండగా ఉంటాడనే భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా గెలుస్తామని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు అందరికీ రోల్ మోడల్ గా పేర్కొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story