Anakapalli: జనసేన ఆఫీసులో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా!
Anakapalli: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో గణపతి పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ.
Anakapalli: జనసేన ఆఫీసులో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా!
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలోని రింగ్‌రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు పీలా గోవింద సత్యనారాయణ మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పీలా గోవింద సత్యనారాయణకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామకృష్ణ (రాంకీ) ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను వినాయకుడి విగ్రహం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. పీలా గోవింద సత్యనారాయణ తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పూజల అనంతరం జనసేన కార్యాలయంలో పలు అంశాలపై పీలా గోవింద సత్యనారాయణ, భీమరశెట్టి రామకృష్ణ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




