Chinturu: చింతూరు ఏజెన్సీలో మళ్లీ వరద భయం ఉధృతంగా శబరి నది!
Chinturu: చింతూరు ఏజెన్సీలో మళ్లీ పెరిగిన వరద భయం. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, శబరి నదులు. నిలిచిపోయిన విఆర్ పురం రాకపోకలు.
Chinturu: చింతూరు ఏజెన్సీలో మళ్లీ వరద భయం ఉధృతంగా శబరి నది!
Chinturu: చింతూరు ఏజెన్సీలో మళ్లీ వరద భయం అలముకుంది. గోదావరి శబరి నదులు పరవళ్ళు తొక్కుతుండడంతో లోతట్టు గ్రామ ప్రజల్లో ఓకింత భయందోళనలకు గురవుతున్నారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి శబరి నదులలో భారీగా నీరు చేరడంతో నదులు నిండుకుండాల్ని తలపిస్తున్నాయి. శబరి నది పరవళ్ళు తొక్కుతుండడంతో శబరి నదికి అనుసంధానమైన సోకిలేరు,చంద్రవంక, కుయుగూరు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
సోకులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ చూటూరు- ముకునూరు గ్రామాల మధ్య వంతెన పైకి నీరు చేరి ప్రవహిస్తుంది. దీంతో చింతూరు నుంచి విఆర్ పురానికి రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 28 అడుగులు చేరుకొని ప్రవహిస్తుంది. వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు.
Next Story




