Visakhapatnam: వేటకు వెళ్లి సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు!
Visakhapatnam: విశాఖ తీరంలో విషాదం. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన జాలారిపేట మత్స్యకారుడు అప్పన్న. మత్స్యశాఖ అధికారుల గాలింపు చర్యలు.
Visakhapatnam: వేటకు వెళ్లి సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు!
Visakhapatnam: సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. జాలారిపేటకు చెందిన అప్పన్న తన సహచరులతో కలిసి ఈ నెల 16న బోటులో వేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో విశాఖకు 11నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఆయన సముద్రంలో పడిపోయినట్లు తోటి మత్స్యకారులు తెలిపారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టి, ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
Next Story




