Chodavaram: చోడవరం మండలంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బుచ్చయ్యపేటలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం.. APAIMS 2.0 యాప్ ద్వారా పంట నమోదుపై రైతులకు అవగాహన.
Chodavaram: చోడవరం మండలంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం!
Chodavaram: రైతులు తమ యొక్క పంటల వివరాలు ఇకపై స్వయంగా మొబైల్ ఫోన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు బుచ్చయ్యపేట మండల వ్యవసాయ అధికారి మళ్ల నారాయణ రావు తెలిపారు.
చిన్న మదీనా, చిట్టియపాలెం గ్రామంలో పొలం పిలుస్తోంది. కార్యక్రమం లో భాగంగా వరి వేసిన రైతులు యొక్క వివరాలు ఏ విధంగా యాప్ లో నమోదు చేసుకోవాలో రైతులకి తమ యొక్క పొలం దగ్గర విపులంగా వివరించారు.
అదేవిధంగా వరి వేసిన ప్రతి ఒక్క రైతు పంట నమోదు చేసుకుంటూ ఈ కేవైసీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవాలని, ఇప్పటివరకు మండలంలో 2415 హెక్టార్లు గాను 727 హెక్టార్లు వరి నాట్లు వేయడం జరిగింది.
వరి నాట్లు వేసిన ప్రతి ఒక్క రైతు కూడా మీ గ్రామంలో ఉన్న వ్యవసాయ సహాయకులకి మీ వివరములు తెలియచేసి తమ ద్వారా ఈ పంట నమోదు చేసుకోవాలని,అదే విధంగా రైతులు కూడా తమ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా కూడా మీ యొక్క పంటలను స్వయంగా మీరే నమోదు చేసుకోవచ్చునని అలా నమోదు చేసిన వివరాలన్నీ మీ రైతు సేవ కేంద్రం వ్యవసాయ సహాయకులు పరిశీలించి అప్రూవల్ చేస్తారని తద్వారా మీకు ప్రభుత్వ పరమైన అన్ని పథకాలు పంటల భీమా ఎరువులు మరియు పంటల కొనుగోలు తదితర సేవలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సాయి వాణి రైతు సేవా కేంద్రం సహాయకుడు సాయి గణేష్ మరియు రైతులు పాల్గొన్నారు.




