Anakapalli: ఎన్‌టీఆర్ పెన్షన్ దరఖాస్తుల గడువును 30 వరకు పొడిగించాలి!

Anakapalli: అనకాపల్లి: ఎన్‌టీఆర్ పెన్షన్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరిన సిద్ధార్థ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Sept 2026 1:33 PM IST
Anakapalli
X

Anakapalli: ఎన్‌టీఆర్ పెన్షన్ దరఖాస్తుల గడువును 30 వరకు పొడిగించాలి!

Anakapalli: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్‌టీఆర్ పెన్షన్ పథకం ప్రయోజనం అందేలా దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఆర్ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు అవకాశం కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే కేవలం పది రోజుల వ్యవధి మాత్రమే ఇవ్వడంతో అర్హులైన పలువురు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు.

ప్రకటించిన పది రోజుల గడువులో సెప్టెంబర్ 12, 13, 14 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో వాస్తవంగా దరఖాస్తులకు అందుబాటులో ఉన్న రోజులు మరింత తగ్గిపోయాయని పేర్కొన్నారు. దీంతో పెన్షన్‌కు అర్హత ఉన్న పలువురు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని బల్లా నాగభూషణం తెలిపారు.

అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకానికి దూరం కాకుండా ఉండాలంటే ఎన్‌టీఆర్ పెన్షన్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేసి అర్హులైన ప్రతి పెన్షన్‌దారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు ఈ విషయంపై సానుకూలంగా స్పందించి పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని బల్లా నాగభూషణం కోరారు.

సంక్షిప్తంగా: అర్హులైన లబ్ధిదారులకు మరింత సమయం కల్పించేందుకు ఎన్‌టీఆర్ పెన్షన్ పథకం దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలన్న డిమాండ్‌ను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI