Etapaka: సీతాపురం ముత్యాలమ్మ ఆలయానికి విద్యుత్ సౌకర్యం
Etapaka: ఎటపాక మండలం సీతాపురం ముత్యాలమ్మ ఆలయానికి ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం కలిగింది. వల్లభనేని చందు విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే శిరీషా దేవి చొరవ తీసుకున్నారు.
Etapaka: సీతాపురం ముత్యాలమ్మ ఆలయానికి విద్యుత్ సౌకర్యం
ఎటపాక: పోలవరంజిల్లా ఎటపాక మండలం సీతాపురం గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయానికి 5 విద్యుత్ స్తంభాలతో నూతన లైన్ మంజూరు అయింది.సీతాపురం గ్రామంలో ఎంతో మహిమ కలిగిన ముత్యాలమ్మ తల్లి ఆలయానికి కొన్ని సంవత్సరాలు నుండి ఆలయానికి విద్యుత్తు సదుపాయం లేకపోవడం తో భక్తులు ఇబ్బంది పడ్డారు.
ఈ విషయాన్ని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు కి గ్రామస్తులు తెలుపగా వెంటనే ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి దృష్టి కి తీసుకు వెళ్ళగానే ఎమ్మెల్యే స్పందించి విద్యుత్ అధికారులను ఆదేశించడంతో నెల్లిపాక ఏఈ సూరిబాబు ఈరోజు తమ విద్యుత్ సిబ్బందితో ఐదు నూతన స్తంభాలు ఏర్పాటు చేసి కొత్త లైన్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఎన్నో సంవత్సరాలుగా భక్తుల మనోభావాలతో కూడిన ఈ సమస్య ఈరోజు పరిష్కారం అవగానే గ్రామస్తులు ఎమ్మెల్యే శిరీషాదేవికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.వల్లభనేని చందు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ సమస్య అయినా రంపచోడవరం నియోజవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఎటపాక మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ , గ్రామ కమిటీ అధ్యక్షులు దుద్దుకూరి సతీష్, 9 వ వార్డు మెంబర్ నాచు శ్రీను, స్థానిక నాయకులు మర్లపాటి రాజు,లింగాల వెంకన్న,పునుగుపాటి అప్పారావు, చల్లగురుగుల శ్రీను, చంటి,ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




