Visakhapatnam: విశాఖ ఉక్కుపై లేని ప్రేమ.. మిట్టల్ ప్లాంట్‌పై ఎందుకు? పడాల రమణ నిలదీత!

Visakhapatnam: విశాఖ ఉక్కు పోరాటం 1828వ రోజుకు చేరిక. మిట్టల్ ప్లాంట్‌కు వేల కోట్ల రాయితీలు ఇస్తూ విశాఖ ప్లాంట్‌ను చంపేస్తున్నారని పడాల రమణ ఆరోపణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 12:18 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ ఉక్కుపై లేని ప్రేమ.. మిట్టల్ ప్లాంట్‌పై ఎందుకు? పడాల రమణ నిలదీత!

విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం నేటికి 1828 పూర్తయిన సందర్భంగా, ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది.

ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ ప్రజా పోరాటాలతో సాధించుకున్న ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను సజీవ సమాధి చేసి ప్రైవేట్ కార్పెట్ సంస్థలకు ఆల్సినరీ విట్టల్ స్టీల్ ప్లాంట్ కు 25 వేల కోట్లు రాయితీలు కల్పించడం ద్వారా ఈ పాలకవర్గాలకు ప్రజా ప్రయోజనాల కన్నా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే మిన్న అని అర్ధమవుతుందని. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.2021 జనవరి 21న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను “స్ట్రాటజిక్ సేల్” పేరుతో 100% ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించినప్పటి నుండి నిరంతరాయంగా పోరాటం కొనసాగుతోందని తెలిపారు. 2021 ఏప్రిల్ 2న ప్రారంభమైన రిలే నిరాహార దీక్ష శిబిరం ఐదు సంవత్సరాలుగా ఎలాంటి విఘ్నాలు ఎదురైనా నిలకడగా కొనసాగుతుండటం కార్మిక వర్గ ఐక్యతకు నిదర్శనమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక సంవత్సరములో అమ్మకం పూర్తి చేయాలని కేంద్రం భావించిందని, ఈ ప్రజా, కార్మిక పోరాటం వల్లే ఇంతవరకు ఒక్క శాతం వాటాను కూడా అమ్మ లేకపోయిందని ఇది ప్రజా విజయమని అన్నారు.

అనకాపల్లి జిల్లాలో నిర్మిస్తున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు వేల కోట్ల రాయితీలు, పన్ను మినహాయింపులు, విద్యుత్–నీటి సదుపాయాలు కల్పిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని విమర్శించారు. “విశాఖ ఉక్కుపై లేని ప్రేమ మిట్టల్‌పై ఎందుకు?” అని ప్రశ్నించారు.32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఖండిస్తూ, ఒకవైపు ప్లాంట్‌ను కాపాడతామని చెప్పుకుంటూనే ఉద్యోగాల కోతలు, జీతాల కోతలు, ఉత్పత్తి ఆధారిత వేతన విధానం, కార్మిక సంఘాలపై బెదిరింపులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story