Visakhapatnam: విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం!
Visakhapatnam: విశాఖపట్నం పాత ఎయిర్పోర్టులో వాణిజ్య విమానాల నిలిపివేతపై దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం.
Visakhapatnam: విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం!
Visakhapatnam: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. పాత ఎయిర్పోర్టులో వాణిజ్య విమానాల నిలిపివేతపై దాఖలైన పిల్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సమస్య ఉత్పన్నమైంది విశాఖపట్నంలోనే అని.. స్థానిక హైకోర్టులోనే సవాల్ చేయాలని సూచించింది. ఫోరమ్ కన్వీనియన్స్ ప్రాతిపదికన పిటిషన్ కొట్టివేసింది.
ప్రధాన కార్యాచరణ అంతా ఏపీలోనే ఉందని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం స్పష్టం చేసింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ వాదనలు వినిపించారు.
కొత్త ఎయిర్పోర్ట్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉందని, కనెక్టివిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువచ్చారు. వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతూందని న్యాయస్థానానికి పిటిషనర్ వివరించారు. అయితే బాధితులంతా విశాఖపట్నంలోనే ఉన్నందున సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనరు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది.




