Chintoor: పోలవరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి ఐద్వా

Chintoor: చింతూరులో ఐద్వా సమావేశం. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం తీవ్రమైందని, పోలవరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్.

RAJESH REDDY, CHINTOOR
Published on: 10 Sept 2026 7:33 PM IST
Chintoor
X

Chintoor: పోలవరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి ఐద్వా

చింతూరు: పోలవరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఐ పద్మావతి డిమాండ్ చేశారు.కారం లక్ష్మీ అధ్యక్షతన చింతూరులో భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఐ. పద్మావతి మాట్లాడుతూ పోలవరం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వెంటనే ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఎల్ నినో ప్రభావంతో పోలవరం జిల్లాలో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రైతులు పంటలు వేసుకునే స్థితిలో లేకుండా పోయింది.

దీంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారని ఆమె అన్నారు. ప్రభుత్వం రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సోడే రమాదేవి,నూనె అశ్విని, దారమ్మ, బుచ్చమ్మ, సీతమ్మ, స్వరూప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story