Visakhapatnam: ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్ల తొలగింపు: సీపీఐ నేత జేవీ!
Visakhapatnam: ఎస్ఐఆర్ పేరుతో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించి బీజేపీ శాశ్వత అధికారానికి కుట్ర చేస్తోందని విశాఖ సీపీఐ భేటీలో రాష్ట్ర నేత జేవీ సత్యనారాయణమూర్తి ఆరోపించారు.
Visakhapatnam: ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్ల తొలగింపు: సీపీఐ నేత జేవీ!
విశాఖపట్నం: ఎస్ఐఆర్ పేరుతో దేశంలోను, మన రాష్ట్రం లోను ఓట్లు తొలగించడం ద్వారానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తన స్థిరత్వాన్ని కాపాడుకుంటూ శాస్వతంగా అధికారంలో కొనసాగాలని కుట్ర పన్నుతున్నదని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె వి సత్యనారాయణమూర్తి ఆరోపించారు.
మంగళవారం విశాఖ అల్లిపురం పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా సమితి సమావేశంలో పాల్గొన్న సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మన దేశ జిడిపి 7.5 శాతం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కలు తప్పని ఇటీవలే పదవీ విరమణలు చేసిన కేంద్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్బిఐ మాజీ గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు పచ్చి అబద్దాలని కేవలం 2.5 శాతం మాత్రమే మన దేశ జిడిపి ఉన్నదని తెలిపారన్నారు.
ఇప్పటికే విద్యా విధానాలలో మార్పులు చేస్తున్నారని, అన్ని ప్రశ్న పత్రాలు లీకేజీలు అవుతున్నాయన్నారు. సీజెపి, జెన్జీ ఉద్యమం తరువాత ఇటీవల రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని తెలిపారు..
కేంద్రం ప్రభుత్వాన్ని కడిగేసిన కాగ్
ఇటీవల కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 40 కేంద్రం మంత్రిత్వ శాఖలలో పెట్టిన ఖర్చులు సక్రమంగా లేవని, కేంద్రం పరిపాలన సరిగా లేదని తెలిపిందన్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశం పాలస్థినా గాజాపై ఇజ్రాయల్ చేసిన దాడులను ఖండిస్తూ తిర్మాణం చెయ్యడం శుభ పరిణామమన్నారు
మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలు గాలికొదిలి ప్రధాని నరేంద్ర మోదీని పొగడటంతోనే సరిపోతుందని, లోకేష్ ని ముఖ్యమంత్రి చెయ్యడంకోసం చంద్రబాబు నరేంద్ర మోదీ జపం చేస్తున్నాదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మనం మంచి ఫలితాలు సాధించడానికి పార్టీ శ్రేణులు కృషి చెయ్యాలని కోరారు.
పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం మన్మధరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్సులు షేక్ రహిమాన్, పి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ విమల, కార్యవర్గ సభ్యులు ఎం పైడిరాజు, కె వనజాక్షి, ఎం డి బేగం, ఆర్ శ్రీనివాసరావు, ఎన్ నాగభూషణరావు తదితరులతో పాటు పలువురు జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.




