Visakhapatnam: బాలికా విద్యకు ఆద్యుడు.. విశాఖలో పూలే 199వ జయంతి వేడుకలు
Visakhapatnam: విశాఖపట్నం మధురవాడలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
Visakhapatnam: బాలికా విద్యకు ఆద్యుడు.. విశాఖలో పూలే 199వ జయంతి వేడుకలు
విశాఖపట్నం: సంఘ సంస్కర్త, సామాజిక వేత్త అంటరానితనం, కుల వ్యవస్థ నిర్ములనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 199 వ జయంతిని శనివారం మధురవాడ సిపిఐ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ మహాత్మగా పిలువబడే జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11జన్మించి, 1890, నవంబరు 28 న మరణించారని తెలిపారు. తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈసంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేర్చుకొని పనిచేశారని గుర్తు చేశారు.
సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని, పూలే అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులయ్యారని అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించి, బాలికల కోసం మొదటి పాఠశాలను1848లో పూణేలో ప్రారంభించారని తెలిపారు. వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారని, ప్రాచీన యుగంలో గౌతమ బుద్ధుడు, ఆధునిక యుగంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఇద్దరు నాకు గురువులని వారి నుంచి నేను చాల విషయాలు నేర్చుకున్నానని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనేక సందర్బాలలో తెలిపారని నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎం డి బేగం, ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, బి కేశవయ్య, పి కాంతమ్మ, ఎం బంగారయ్య, కె జగ్గాస్వామీ, రాం మహేష్, కాలీషా, చిన్నారావు, నాగరాజు పలువురు మహిళలు పాల్గొని నివాళులు అర్పించారు.




