Visakhapatnam: విశాఖలో 103 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ!

Visakhapatnam: విశాఖలో కోరమాండల్ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో 103 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులకు కలెక్టర్ అభిశిక్త్ కిశోర్ చేతుల మీదుగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 28 Aug 2026 2:51 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో 103 మంది విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ!

Visakhapatnam: విశాఖపట్నం, పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని 58వ వార్డులో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. కోరమాండల్ రిక్రియేషన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిశిక్త్ కిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.

జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుతూ తమ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన సుమారు 103 మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను అందించారు. వారిలో శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, మింది, నడుపూరు ప్ర‌భుత్వ ఉన్నత పాఠ‌శాల‌ల విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కు చెందిన విద్యార్థులు ఉన్నారు.

విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు బాలికల్లో ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story