Visakhapatnam: విశాఖలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Visakhapatnam: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు సేవలను స్మరించుకున్నారు.

SHIVA, BHIMILI
Published on: 20 Aug 2026 4:42 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Visakhapatnam: భారత సాంకేతిక విప్లవ పితామహుడు, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగర పార్టీ కార్యాలయంలో గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పార్టీ కార్యాలయంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం జరిగిన సభలో జిల్లా అధ్యక్షుడు వర్మ రాజు మాట్లాడుతూ.. దేశంలో సమాచార సాంకేతిక (IT) రంగం, టెలికాం విప్లవానికి రాజీవ్ గాంధీ వేసిన పునాదులే నేటి ఆధునిక భారత్ నిర్మాణానికి మూలస్తంభాలని కొనియాడారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ చేపట్టి, గ్రామీణ ప్రాంతాలకు, యువతకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతను భాగస్వాములను చేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని గుర్తుచేశారు.

దేశ సమగ్రత, సాంకేతిక అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని, ఆయన ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఇంచార్జీ కేవీ సూర్యనారాయణ,మహిళా కాంగ్రెస్ నాయకులు కండవ గాయత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంకర ఆనందకుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు పినమాల శివ, ఆఫీసు ఇంచార్జి సబ్బవరపు శ్రీధర్, పశ్చిమ నియోజకవర్గ 52 వార్డు నాయకులు కొమరపు చైతన్య, ఎస్సీ సెల్ కస్తూరి వెంకట రావు, అర్షద్ భాషా , వార్డు ప్రెసిడెంట్లు కనకరావు,కాకర అప్పారావు,ఈశ్వర రావు,కొండపల్లి శ్రీనివాసరావు,సరస్వతమ్మ, యాదగిరి అర్జున్, సంతోష్ మరియు మైనారిటీ సెల్ ప్రతినిధులు, సీనియర్ నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story