Araku: అరకులో సమగ్ర ప్రజారోగ్య పరీక్షా కేంద్రం ప్రారంభం!

Araku: అల్లూరి జిల్లా అరకు ఏరియా ఆసుపత్రిలో సమగ్ర ప్రజారోగ్య పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ, టీడీపీ ఇంచార్జ్ దొన్ను దొర.

SAI, PADERU
Published on: 12 Sept 2026 1:55 PM IST
Araku
X

Araku: అరకులో సమగ్ర ప్రజారోగ్య పరీక్షా కేంద్రం ప్రారంభం!

Araku: వైద్య పరీక్షలకు విశాఖపట్నమో పాడేరో వెళ్లాల్సిన అవసరం లేదని ఇకనుంచి ప్రజలకు కావలసిన అన్ని వైద్య పరీక్షలు అరకు వ్యాలీలోనే కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా.సియ్యారి దొన్ను దొర పేర్కొన్నారు.

అరకు ఏరియా ఆసుపత్రిలో కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రాన్ని అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమల శ్రీ పూజ తో కలిసి దొన్ను దొర శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా దొన్ను దొర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్య భద్రతకు రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. గిరిజనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం తాజాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా మన ప్రాంతానికి వచ్చి డ్రోన్ ఆధారిత వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

ఈ కార్యక్రమం జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం అవుతుందని ముఖ్యంగా మన గిరిజన ప్రాంత వాసులకు సంజీవని అద్భుతమైన ఫలితాలు ఇవ్వచ్చునన్నారు. ఇది మన గిరిజలకు ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ అన్నారు. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్లేందుకే నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉంది అని మన గిరిజన ప్రాంతంలో ఏరియా ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందడం వెంటనే వైద్య పరీక్షల పూర్తి కాకపోవడం వంటి సమస్యలను ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నామన్నారు. దీనికి సంజీవిని శాశ్వత పరిష్కారం అన్నారు.

SAI, PADERU

SAI, PADERU