Anakapalle: బాటజంగాల పాలెంలో పాలియేటివ్ కేర్ సెంటర్ ప్రారంభం!

Anakapalle: అనకాపల్లి బాటజంగాల పాలెంలో హోమిబాబా క్యాన్సర్ ఆసుపత్రి, సీతార పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 4 Sept 2026 11:00 AM IST
Anakapalle
X

Anakapalle: బాటజంగాల పాలెంలో పాలియేటివ్ కేర్ సెంటర్ ప్రారంభం!

Anakapalle: క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో వైద్యం అందించడం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా బాటజంగాల పాలెం ప్రాంతంలో హోమిబాబా క్యాన్సర్ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్, సీతార - ఉపశమన సంరక్షణ (పాలియేటివ్ కేర్) కేంద్రంను పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తో కలిసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను తోలి దశలోనే గుర్తించి, వైద్యం అందించడం అత్యంత కీలకమని తెలిపారు.

శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, అవసాన దశలో ఉన్న క్యాన్సర్ రోగుల ఉపశమన సంరక్షణకు అవసరమైన సేవలు ఇక్కడ అందుతాయని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకుల వసతి, మౌలిక సదుపాయాల కోసం విడతల వారీగా దాదాపు రూ. 1 కోటి సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే రోగులు, సహాయకులకు ఆహార సదుపాయాలు కల్పించేందుకు సహకరిస్తామన్నారు.

అభివృద్ధికి సహకరించిన ఇంబెల్ (ఇండియా) లిమిటెడ్, ICICI ఫౌండేషన్, సిప్లా (CIPLA) ఫౌండేషన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కేంద్రంలో ప్రతి గురువారం ఉదయం MLHPలకు, మధ్యాహ్నం ఆశా కార్యకర్తలకు క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ మరియు పాలియేటివ్ కేర్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేడు మొదటి విడత శిక్షణ పూర్తి అయినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. ఆర్. అచ్యుత కుమారి, హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డా. ఉమేష్ మహంతశెట్టి, ట్రైనింగ్ హెడ్ డా. డోలా రోసా, ప్రాజెక్ట్స్ నోడల్ ఆఫీసర్ మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. చంద్రశేఖర్ దేవ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఎస్థర్ రాణి తదితర అధికారులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story