Parawada: పరవాడ దళితపేటల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీఐటీయూ!
Parawada: పరవాడ పరిధిలోని దళితవాడల్లో సీఐటీయూ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ పర్యటన. డ్రైనేజీ, తాగునీరు, స్మశాన వాటిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్.
Parawada: పరవాడ దళితపేటల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీఐటీయూ!
Parawada: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సామాజిక శంఖారావంరాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు సర్వేలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా సోమవారం భరణి కం, బాపడ పాలెం, పరవాడగ్రామంలో సిఐటియు నాయకులు గనిశెట్టి. సత్యనారాయణపర్యటన చేయడంజరిగింది.
ఈగ్రామంలలో ఎదుర్కొంటున్న సమస్యలపైదళితులును ఆరా తీయడం జరిగింది. పరవాడలో స్మశాన వాటిక దళితులకు లేకపోవడం విచారకరమన్నారు. బాపట్లపాలెంలో నీరు ప్రవహించే డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోయిందని, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని తెలిపారు. ఇంటింటికోలాయిలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. బర్నికం దళితపేటలో వీధిలైట్లు, కొళాయి నుండి నీరు రావడం లేదన్నారు.
ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు.
Next Story




