Parawada: ఫార్మా, కెమికల్ కార్మికులకు వేతనాలు పెంచాలి: సిఐటియు
Parawada: పరవాడ, లంకెలపాలెంలో ఫార్మా, కెమికల్ కార్మికుల వేతనాలు పెంచాలని CITU డిమాండ్. జూలై 30న 'చలో కలెక్టరేట్'ను జయప్రదం చేయాలని పిలుపు.
Parawada: ఫార్మా, కెమికల్ కార్మికులకు వేతనాలు పెంచాలి: సిఐటియు
పరవాడ: ఫార్మా, కెమికల్ కార్మికులకు వేతనాలు పెంచాలి
జూలై 30న చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి
ప్రచార జాతను ప్రారంభించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు
జిల్లాలో వివిధ ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంపుదల చేయాలని, భద్రత కల్పించాలని కోరుతూ ఈరోజు లంకెలపాలెం లో సిఐటియు ప్రచార జాతర జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు ప్రారంభించారు. పరవాడ ఫార్మసిటీలోనూ జిల్లాలో వివిధ ఫార్మా, కెమికల్ కంపెనీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఇతర ఉద్యోగులు కు ప్రభుత్వం వేతనాల పెంపు జీవోను సవరించకపోవడంతో ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని అన్నారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో ప్రతి ఐదేళ్లకు పెంచాల్సిన వేతనాల పెంపు జీవోను 15 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న జీవోను సవరించకపోవడం దుర్మార్గం అన్నారు. దీంతో కొన్ని యాజమాన్యాలు వి డి ఏ పాయింట్లు మేరకు పెంపుదల చేసి చేతులు దులుపుకుంటున్నాయని అన్నారు. 15 ఏళ్లుగా వేతనాల జీవోను సవరించకపోవడంతో ఒక్కొక్క కార్మికుడు కనీసం నెలకు పదివేల రూపాయలను నష్ట పోతున్నారని ఇది కార్మికుల కష్టాన్ని దోచుకోవడమేమని అన్నారు. ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల వేతనాల పెంపు జీవోకై ఈ
నెల 30 న చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని దీనిలో ఫార్మా, కెమికల్ కంపెనీ లలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కరణం వెంకట్రావు, రామకృష్ణ, అప్పారావు, సత్తిబాబు, రాజు, తదితరులు పాల్గొన్నారు.




