Bheemili: తప్పిపోయిన ఇద్దరు పిల్లలు 2 గంటల్లోనే సేఫ్!
Bheemili: తప్పిపోయిన ఇద్దరు పిల్లలను సీఐ దివాకర్ యాదవ్ నేతృత్వంలోని పోలీస్ బృందం రెండు గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో సురక్షితంగా గుర్తించింది.
Bheemili: తప్పిపోయిన ఇద్దరు పిల్లలు 2 గంటల్లోనే సేఫ్!
భీమిలి: భీమిలి SOS గ్రామంలోని తల్లిదండ్రులు లేని ఇద్దరు పిల్లలు ఈరోజు కనిపించకుండా పోయారు. 6 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మిస్ అయినట్లు సమాచారం రాగానే సి.ఐ. శ్రీ దివాకర్ యాదవ్ గారు వెంటనే FIR నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
బృందాలు అప్రమత్తమై సాంకేతిక ఆధారాలు మరియు సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితంగా రెండు గంటల్లోనే ఇద్దరు పిల్లలను గుర్తించి సురక్షితంగా SOS ప్రతినిధులకు అప్పగించడం జరిగింది.
స్టేషన్కు తీసుకొచ్చిన అనంతరం సి.ఐ గారి ఆదేశాల మేరకు పిల్లలకు స్నాక్స్ ఇప్పించి, కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లలు సురక్షితంగా ఉండటంతో SOS సిబ్బంది మరియు స్థానికులు భీమిలి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇలాంటి కేసుల్లో వెంటనే స్పందిస్తామని సి.ఐ గారు తెలిపారు.




