Chodavaram: చోడవరం రోడ్లకు రూ.10.71 కోట్లు మంజూరు..ఎమ్మెల్యే KSNS రాజు!

Chodavaram: చోడవరం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.10.71 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే KSNS రాజు తెలిపారు. అక్టోబర్ నెలాఖరుకు బి.ఎన్.రోడ్డు పనులు పూర్తి.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 13 Sept 2026 11:45 AM IST
Chodavaram
X

Chodavaram: చోడవరం రోడ్లకు రూ.10.71 కోట్లు మంజూరు..ఎమ్మెల్యే KSNS రాజు!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని చోడవరం, బుచ్చియ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు సంబంధించి రోడ్లు నిర్మాణానికి రూ.10 కోట్ల 71 లక్షలు మంజూ రయ్యా యని, వీటికి టెండర్లు కూడా ఖరారు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభం అవుతాయని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు తెలిపారు.

చోడవరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ చోడవరంలోని కోటవీధి నుండి తిమ్మనపాలెం వరకు వయా పి.యెస్ పేట మీదుగా ఉన్న 9.882 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ 2 కోట్ల 35 లక్షలు మంజూరు అయ్యాయని,

చోడవరం మండలం లోని అంబేరుపురం నుండి రాయపు రాజుపేట గ్రామం వరకు ఉన్న 2.590 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ 2 కోట్లు మంజూరయ్యాయని అన్నారు.

జన్నవరం నుండి పోలేపల్లి బుచ్చయ్యపే ట మట్టవానిపాలెం మీదుగా రావికమతం రోడ్డు వరకు (ఆర్.ఈ.సి రోడ్డు) ఉన్న 9.020 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల 76 లక్షలు మంజూరయ్యాయని, రోలుగుంట మండలంలోని బి.ఎన్ రోడ్డు నుండి కొంతలం మీదుగా శరభవరం వరకు ఉన్న 5.876 కిలోమీటర్ల రోడ్డుకు రూ 2 కోట్లు మంజూరయ్యాయని, అలాగే కసింకోట బంగారుమెట్ట రోడ్డు నుండి పెదమదిన గున్నెంపూడి పి ల్లవానిపాలెం మీదగా రావికమతం రోడ్డు వరకు ఉన్న 9.230 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1 కోటి 60 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభమవు తాయని తెలిపారు. చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంట నుండి

గంధవరం వరకు అక్కడక్కడ మిగిలిపోయిన మెయిన్ రోడ్డు (బిఎన్ రోడ్డు ) అక్టోబర్ నెలాఖరు లోగా పూర్తి అవుతుందని, విజయరామరాజుపేట, వడ్డాది వద్ద పడిపోయిన వంతెనలకు త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి మంజూరు చేస్తామని, చోడవరంలో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తాహ సిల్దార్ కార్యాలయం, రైతు బజారు, గంధవరంలోని ఏపీ సీడ్స్ త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని, వీటి ప్రారంభానికి జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సిఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

రోడ్లు నిర్మాణానికి నిధులు మంజురు చేసినందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కు, ఎంపీ సిఎం రమేష్ కు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు ధన్యవాదములు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM